కలం, వెబ్‌డెస్క్ : యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (UK House of Lords) తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. సిద్ధిపేట జిల్లా కొహెడ లోని శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) వరంగల్, హైదరాబాద్ లో చదువుకున్నారు. అనంతరం బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో పాలన శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు.
కాగా, ఉదయ్ బ్రిటన్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ (UK House of Lords) నామినేట్ అయ్యారు. ఈ సభకు సభ్యులను ప్రధాని సలహా మేరకు ఇంగ్లండ్ రాజు నామినేట్ చేస్తారు. రాజీకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వేస్తారు. నైపుణ్యం, అనుభవం, దేశసేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నుకుంటారు. చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, దేశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి విధులు నిర్వహిస్తుంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల బరిలో లేబర్ పార్టీ తరఫున ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) బరిలో నిలిచారు.
ఇప్పుడు నాగరాజు యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎంపిక కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ నాగరాజు ప్రస్థానాన్ని కొనియాడారు. ‘‘యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేయడం దగ్గరి నుంచి మొదలుకొని.. నేడు ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం వరకు మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మీ కొత్త బాధ్యతల్లో మీకు అంతా మంచే జరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావుకు పోలీస్ కస్టడీ
Follow Us On: Pinterest


