Pocso Case | తునిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేత తాటిక నారాయణ రావు.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే కేసులో కోర్టుకు తరలిస్తుండగా మూత్రవిసర్జన కోసమని చెప్పి వెళ్లిన నారాయణ రావు.. చెరువులో దూకేశాడు. ఉదయం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపులు చేపట్టగా నారాయణరావు మృతదేహం లభ్యమైంది.
Pocso Case | తాతని అవుతా అంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్లిన టీడీపీ నేత నారాయణరావు.. ఆ బాలికపై అత్యాచారానికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సమయంలో స్థానికుడు ఒకరు ప్రశ్నించడంతో వారిపై నారాయణ వాగ్వాదానికి దిగారు. తాను మున్సిపల్ కౌన్సిలర్ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసలు అమ్మాయిని తొటలోకి తీసుకొచ్చి.. బట్టలు విప్పించే ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు నారాయణరావు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: చిన్నారిపై అత్యాచారం.. కఠిన శిక్ష విధించిన కోర్టు

