పోక్సో కేసుల విషయంలో నల్గొండ పోక్సో కోర్టు(Nalgonda Pocso Court) తనదైన శైలిలో శిక్షలు విధిస్తోంది. తాజాగా మరో పోక్సో కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ కఠిన శిక్ష విధించింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు గురజాల చందును దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. దీంతో అతడికి 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధించింది. గతంలో కూడా కొన్ని పోక్సో కేసుల్లో నల్గొండ పోక్సో కోర్టు కఠిన శిక్షలను విధించింది.
2022లో నల్గొండ(Nalgonda) టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ చిన్నారి మిస్సింగ్ కేసు నమోదయింది. చిన్నారిని కిడ్నాప్ చేసి నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి పోక్సో కోర్టులో నడుస్తున్న ఈ కేసులో కోర్ట్ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి.. బుధవారం తీర్పు ఇచ్చారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని తెలిపిన ఆమె.. నిందితుడికి శిక్షను వెలువరించారు.
Read Also: దసరాకి భార్య.. దీపావళికి భర్త ఆత్మహత్య

