సౌతాఫ్రికా వేదికగా నవంబర్‌లో జరిగే జీ20 సమ్మిట్(G20 Summit)కు రష్యా అధ్యక్షుడు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికార ప్రతినిధి డ్మిట్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు.. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్(Putin).. ఈ సదస్సుకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. జీ20లోని బలమైన భాగస్వామి అయినప్పటికీ ఐసీసీ ఆదేశాల కారణంగా పుతిన్ ఈ సదస్సుకు దూరం పాటిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో ఐసీసీ.. పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది.
ఇదిలా ఉంటే జీ20(G20 Summit) అనేది ప్రపంచంలోని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల సమ్మేళం. ఇది ప్రపంచ జీడీపీలో 85శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచ జనాభాలో ఈ జీ20లోని దేశాలు 66శాతం జనాభాను రిప్రజెంట్ చేస్తాయి.
Read Also: ‘కాంతారా-1’లో రిషబ్ డ్యూయల్ రోల్ చేశాడా..!

