జూబ్లీహిల్స్ ఎన్నికలో(Jubilee Hills Bypoll) కాంగ్రెస్‌ను చిత్తు చేస్తామంటూ హైదరాబాద్ యూత్ కరేజ్(HYC) నేత సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. తాము కాంగ్రెస్ అంతిమ యాత్ర చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు సల్మాన్ ఖాన్. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింలు వేసిన 99శాతం నామినేషన్లను రిజెక్ట్ చేశారని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రేవంత్ చెప్పినట్లే నడుస్తున్నారని విమర్శలు చేశారు. ముస్లింల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి.. ఈ నామినేషన్ల అంశంతో స్పష్టం అవుతోందన్నారు. ముస్లింలపై వివక్ష చూపుతున్నారని, వారిని తొక్కేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో తమకు బాగా తెలుసని, అదే విధంగా బుద్ధి చెప్పి తీరతామని అతడు వ్యాఖ్యానించాడు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హెచ్‌వైసీ సల్మాన్ ఖాన్ పేరు తెగ వినిపిస్తోంది.
Read Also: జీ20కి పుతిన్ దూరం.. వెల్లడించిన రష్యా

