epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టీటీడీ చుట్టూ వివాదాలు..!

కలం, వెబ్ డెస్క్: తిరుమలలో ఇటీవల మరో కుంభకోణం బయటపడింది. కల్తీ నెయ్యి.. పరకామణి కుంభకోణాల ఆరోపణల తర్వాత ఇప్పుడు శాలువాల కుంభకోణం సంచలనంగా మారింది. పట్టు శాలువాలను శ్రీవారికి చేసే వివిధ సేవల్లో, శ్రీవారిని దర్శించుకునే వీవీఐపీలకు వేదాశీర్వచనం అందించడానికి, దాతలను సత్కరించడానికి వాడుతుంటారు. అయితే, 2015 నుంచి 2025 దాకా పట్టు శాలువాలకి బదులు పాలిస్టర్ శాలువాలు అమ్మారని టీటీడీ (TTD) విజిలెన్స్ ఆరోపించింది. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే.. పదేండ్లుగా పాలిస్టర్ శాలువాలు సప్లై చేస్తుంటే టీటీడీ ఆఫీసర్లు, బోర్డు మెంబర్లు ఎందుకు గుర్తు పట్టలేకపోయారు. టీటీడీలో అన్ని విజిలెన్స్ కమిటీలు, చెకింగ్ టీమ్ లు ఉంటాయికదా. వాళ్లు గుర్తు పట్టకపోవడంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పట్టుశాలువాల మీద TTD విజిలెన్స్ ఆఫీసర్లకు రీసెంట్ గా డౌట్ ఒచ్చింది. తిరుపతిలోని గోదాం, వైభవోత్సవ మండపం నుంచి శాలువాల స్టాక్ ను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్‌ సిల్క్‌బోర్డులకు పంపి టెస్ట్ చేయిస్తే.. ఆ శాలువాల్లో అసలే పట్టు లేదు.. అవన్నీ వందశాతం పాలిస్టర్‌ అని తేలింది. శ్రీవారి ఆలయానికి వచ్చే వీవీఐపీలకు, సెలబ్రిటీలకు వేద ఆశీర్వచనం కింద కప్పేందుకు తీసుకొస్తారు. నగరికి చెందిన మెసర్స్‌ వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీకి గతంలోనే ఈ శాలువాల కాంట్రాక్ట్ ఇచ్చారు. 350 నుంచి 400 రూపాయల విలువ జేసే శాలువాలను 1400 దాకా అమ్మింది ఈ వీఆర్ ఎస్ ఎక్స్ పోర్ట్ కంపెనీ.

2015 నుంచి ఇప్పటి దాకా రూ.54 కోట్ల దాకా స్కామ్ జరిగిందని విజిలెన్స్ కమిటీ బయట పెట్టింది. ఈ కేసును ఏసీబీకి అప్పగించారు. టీటీడీ ఇలా వరుస కుంభకోణాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గతంలో తిరుమల అంటే ఎంతో గొప్పగా వెంకటేశ్వర స్వామి గురించే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఈ కుంభకోణాల గురించి మాట్లాడుకునే పరిస్థితులు తీసుకొచ్చారని స్వామి వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే స్వామి వారి ఆలయం చుట్టూ ఈ వివాదాలను భక్తులు ఖండిస్తున్నారు. దేవుడంటే భక్తి లేకుండా ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు.

Read Also: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>