కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను (Hydraa) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కబ్జాకు గురవుతున్న భూములు, నాలాలు, చెరువులను కాపాడుతూ ఎన్నో ప్రభుత్వ భూములను కాపాడింది. ఇందుకోసం ప్రజావాణిని కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరిస్తోంది. అధికారుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్నో సమస్యలను పరిష్కరించిన హైడ్రా 50 ఏళ్ల సమస్యకు పరిష్కారమార్గం చూపింది.
హైదరాబాద్‌లోని (Hyderabad) ముషీరాబాద్ నియోజవర్గం రాంనగర్ స్థానికులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ పైపులైన్ దెబ్బతినడంతో దుర్వాసన భరించలేక నరకం చూశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్లుగా సమస్యతో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రాంనగర్ వాసులు హైడ్రాకు (Hydraa) ఫిర్యాదు చేయడంతో గతేడాది ఆగస్టు 28న డ్రైనేజీ పైపులైన్ పరిస్థితిని కమిషనర్ రంగనాథ్ (AV Ranganath) స్వయంగా పరిశీలించారు. కోర్టు వివాదాలు పరిష్కరించి, భూగర్భ డ్రైనేజీ పైపులైన్ పనులు పూర్తి చేయించారు. 50 ఏళ్ల సమస్యకు చెక్ పెట్టడంతో స్థానికులు రంగనాథ్‌ను కలిసి ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: మెస్సీ కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


