కలం వెబ్ డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల 2026 మార్చి(March) నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు(Darshan Tickets), వసతి గదుల కోటాను దశలవారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. నేడు (డిసెంబర్ 22) ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల తెప్పోత్సవాలు, వసంతోత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అనంతరం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి అనుసంధానించిన దర్శన స్లాట్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఇక డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్(Srivani Trust) బ్రేక్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా భక్తులు ఈ టికెట్లను టీటీడీ(TTD) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ సైట్లు, మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరించారు.
Read Also: అయోధ్య నుంచి ద్వారక వరకు: సప్త మోక్ష నగరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
Follow Us On: Instagram


