కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన విషయాల గురించి చర్చించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాలవారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అన్నిచోట్లా అనుకున్న మేర ఫలితాలు రాలేదు. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలు బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో ఆయా నియోజవర్గాలకు ప్రాతినిథ్యం వహించిన కొందరు మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించవచ్చు. అలాగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, వివిధ అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికల జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, ఇతర పథకాలపై చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
Read Also: క్లీనర్‌గా మారిన ఇండియన్ సాఫ్ట్‌వేర్.. శాలరీ లక్షకుపైనే!
Follow Us On: X(Twitter)


