కలం వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport)కు బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం రేపింది. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తరచూ ఎయిర్ పోర్ట్ బాంబు బెదిరింపులు రావడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Read Also: నేడు టీటీడీ మార్చి నెల దర్శన టికెట్లు విడుదల
Follow Us On: Youtube


