కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండలు భక్తజన సంద్రమై కనిపిస్తున్నాయి. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. శిలాతోరణం వరకు భక్తులు భారీగా నిల్చొని దర్శనం కోసం వేచిచూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులన్నీ పూర్తిగా నిండిపోవడంతో పరిస్థితి మరింత రద్దీగా మారింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ (TTD) అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలో ఒత్తిడి తగ్గించేందుకు అర్ధరాత్రి 12 గంటల నుంచే దర్శన టోకెన్‌ల జారీ చేపట్టారు. ఈ నిర్ణయంతో భక్తులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఇక తిరుమలలో (Tirumala) పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సహనంతో సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Read Also: నేరేడు పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Follow Us On: X (Twitter)

