40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ కి భారత ప్రధాని!

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు న్యూజిలాండ్‌లో పర్యటనను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ అధికారిక పర్యటన ఇరు దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. గత 40 ఏళ్ల కాలంలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లోని ప్రముఖ నగరం ఆక్లాండ్‌కు చేరుకోనున్నారు.

ఈ రెండు రోజుల పర్యటనలో భారత్-న్యూజిలాండ్ మధ్య వాణిజ్య పరమైన అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమలు పరచడంపై ప్రధాని మోదీ అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ (PM Modi) చేపట్టిన ఈ పర్యటనతో భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని, వాణిజ్య, సాంకేతిక రంగాలలో సరికొత్త అవకాశాలు మెరుగవుతాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>