Mobile Popup Ad
Mobile Popup Ad

నేరేడు పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

కలం, వెబ్‌డెస్క్: వేసవి కాలం చివరలో, వర్షాకాలం ప్రారంభంలో లభించే ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదం నేరేడు పండ్లు (Java Plum). ముదురు ఊదా, నలుపు రంగులో ఉండి తీపి, పులుపు, వగరు కలిసిన ప్రత్యేకమైన రుచి కలిగిన ఈ పండ్లను అందరూ ఇష్టపడతారు. అయితే ఈ పండ్లను ఆయుర్వేదంలో ఒక గొప్ప సర్వరోగ నివారిణిగా, ఔషధంగా పరిగణిస్తారని మీకు తెలుసా? మండే ఎండలు, వడదెబ్బల నడుమ.. ఈ చిన్న పండు ఏసీలా శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా తీవ్రమైన వ్యాధుల నుండి ఇనుప గోడలా కాపాడుతుందట. వేసవిలో నేరేడు పండు తినడం వల్ల శరీరంలో జరిగే ఆ అద్భుతమైన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహ రోగులకు సహజ అమృతం

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి వేసవిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో నేరేడు పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో ఉండే జాంబోలిన్ అనే ప్రత్యేక మూలకం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందట. ఇది మనం తినే ఆహారంలోని పిండిపదార్థం అంత త్వరగా చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది.

కడుపు సమస్యలకు శాశ్వత పరిష్కారం

అన్ని కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో మన జీర్ణశక్తి చాలా బలహీనపడుతుందట. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. నేరేడు పండులో ఫైబర్, రాగి పుష్కలంగా ఉండటంతో ఇవి జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి, కడుపు నొప్పి, విరేచనాల సమస్య నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

ఎండలోనూ ముఖానికి సహజమైన కాంతి

నేరేడు పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి వేసవిలో సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండు సహజంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, మరకలు మాయమై చర్మం కాంతివంతంగా మారుతుందని సూచిస్తున్నారు.

గుండెపోటు, రక్తపోటు ప్రమాదాలకు బ్రేక్

ఈ చిన్న పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం హై బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

నీరసం మాయం.. రక్తం పెంపు

ఎండల తీవ్రత కారణంగా వేసవిలో మనం చాలా త్వరగా అలసిపోతుంటాం, నీరసం ఆవహిస్తుంది. నేరేడు పండులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దీనితో పాటు ఇందులోని విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చూస్తుందట.

ప్రకృతి వేసవి తాపం నుండి మనల్ని రక్షించడానికి ఇచ్చిన అద్భుతమైన కానుక నేరేడు పండు. కేవలం రుచి కోసమే కాకుండా పైన పేర్కొన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ సమ్మర్‌లో నేరేడు పండ్లను మీ డైట్‌లో భాగం చేసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>