ఇరాన్ తో శాంతి ఒప్పందం: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

కలం, వెబ్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్ సంక్షోభంపై ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇరాన్ దేశంతో శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. తాను వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ నుండి సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి పలు దేశాల అధినేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తో కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహనా పత్రం (MoU) పై ఈ చర్చలు జరిగాయని చెప్పారు.

అమెరికా, ఇరాన్ తో పాటు మిగిలిన మధ్యప్రాచ్య దేశాల మధ్య ఈ ఒప్పందం తుది దశకు చేరిందని వివరించారు. దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా తాను విడిగా మాట్లాడానని, ఆ సంభాషణ కూడా చాలా సానుకూలంగా సాగిందని ట్రంప్ తెలిపారు. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధిని తిరిగి తెరుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ డీల్ కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ట్రంప్ (Trump) పేర్కొన్నారు.

Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

Follow Us On: X (Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>