కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా గ్రీన్ కార్డు లాటరీ (Green Card Lottery) ప్రోగ్రామ్ ను ఆపేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రీసెంట్ గా బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల వల్ల ఈ గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ ఆపేస్తున్నట్టు వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఎందుకంటే కాల్పులు జరిపిన క్లాడియో నెవెస్ వాలెంటే (48) పోర్చుగీసు పౌరుడిగా గుర్తించారు అధికారులు. అతను 2017లో ఈ గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ ద్వారానే అమెరికాలో శాశ్వత నివాసం పొందాడు. అలాంటి వ్యక్తులకు అమెరికాలో ఎట్టి పరిస్థితుల్లో శాశ్వత నివాసం ఇవ్వబోమని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రతి ఏడాది ఈ గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ లో వివిధ దేశాలకు చెందిన వారికి 50వేల గ్రీన్ కార్డులు ఇస్తారు. అయితే దీని ఎఫెక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుందా అని చూస్తే.. ముఖ్యంగా ఐటీ, ఇతర టెక్ జాబ్ లు చేసే వాళ్లు కంపెనీ వీసాలపై ఆధారపడితే వాళ్లకు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లకు కంపెనీలు గ్రీన్ కార్డుల కోసం అప్లై చేయాలి అనుకుంటే ఆ అవకాశాలు ఇప్పుడు ఉండవు. ఇక వ్యక్తిగతంగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న ఇండియన్ ఎన్నారైలలో దీనిపై ఒకింత టెన్షన్ ఉంది.
కానీ ఈ గ్రీన్ కార్డు లాటరీ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లుగా ఏ దేశం అయితే 50వేల కంటే తక్కువ ఇమిగ్రెంట్లను అమెరికాకు పంపుతుందో ఆ దేశానికి మాత్రమే గ్రీన్ కార్డు లాటరీకి (Green Card Lottery) అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. గత ఐదేళ్లుగా చూస్తే ఇండియా 2021లో 93450 మంది అమెరికాలోకి వెళ్లారు. 2022లో 1,27,010 మంది, 2023లో 78070 మంది అమెరికాకు వెళ్లారు. గతేడాది కూడా భారీగానే వెళ్లారు. కాబట్టి ఈ గ్రీన్ కార్డు లాటరీకి అప్లై చేసుకునే ఛాన్స్ ఇండియాకు లేదు. 2028 లేదా 29 వరకు ఈ గ్రీన్ కార్డు లాటరీలకు ఇండియన్స్ అర్హులు కాదు. ప్రస్తుతం హెచ్ 1బీ వీసాలపై ఉన్న వాళ్లు ఇంకో మూడేళ్ల దాకా ఉన్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ట్రంప్ నిర్ణయం ప్రత్యక్షంగా మన ఇండియన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు.
Read Also: సిడ్నీ ఉగ్రదాడితో హైదరాబాద్కు సంబంధం లేదు : డీజీపీ
Follow Us On: Sharechat


