కలం, వెబ్ డెస్క్ : కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా సిడ్నిలో ఉన్న బాండీ బీచ్ ఉగ్రదాడికి (Australia Terror Attack) హైదరాబాద్ కు సంబంధం లేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. కాల్పులకు పాల్పడిన నిందితుల్లో ఉన్న సాజిద్ అక్రమ్ హైద్రబాద్ కు చెందిన వాడే అయినప్పటికీ ఆ దాడితో హైదరాబాద్ నగరానికి సంబంధం లేదన్నారు. 1998 ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్కడే యూరప్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిపారు. పెళ్లి అయిన తరువాత భార్యతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడని.. అంతకుముందు 5 సార్లు ఇక్కడికి వచ్చాడని డీజీపీ వెల్లడించారు. కాగా బాండీ బీచ్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 16 మంది చనిపోయారు.
Read Also: గొత్త కోయలపై ఇద్దరివీ భిన్న స్వరాలు
Follow Us On: Pinterest


