కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్యేల (Telangana MLAs) పై దాఖలైన అనర్హత పిటిషన్ల కేసు సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు రాలేదు. రేపటి నుంచి సుప్రీం కోర్టుకు శీతాకాల సెలవులు ప్రారంభమవుతాయి. జనవరి 5 తర్వాత ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. ఫిరాయింపు(Defection Case) ఆరోపణలపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
Read Also: నాకు మంత్రి పదవి రాబోతుంది : రాజగోపాల్ రెడ్డి
Follow Us On: X(Twitter)


