కలం, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ(Telangana DGP) ఎదుట 41 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి సహా పలువురు కీలక నాయకులు ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ ఉన్నారు.
అలాగే ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు కూడా లొంగిపోయారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల (Maoists) నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయి శాంతి మార్గాన్ని ఎంచుకున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.
Read Also: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ.. తెరిచేదెన్నడు..?
Follow Us On: Instagram


