Mobile Popup Ad
Mobile Popup Ad

20 ఏళ్లలో తొలిసారి.. ట్రంప్ కు భారీ షాక్!

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) దళాలను పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటించిన కొద్ది రోజులకే.. అగ్రరాజ్యానికి భారీ షాక్ తగిలింది. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్‌ దాడి చేసింది. గత 20 ఏళ్లలో శత్రువుల దాడిలో అమెరికా ఫైటర్ జెట్స్ కూలిపోవడం ఇదే తొలిసారి. సైనికపరంగా అమెరికాతో ఇరాన్ ఏమాత్రం సరితూగలేనప్పటికీ, తన అసమాన యుద్ధ తంత్రంతో అమెరికా ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరాన్ వద్ద విమాన విధ్వంసక వ్యవస్థలే లేవని, వారి గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోనే ఉందని ట్రంప్ ప్రకటించిన సరిగ్గా వారం రోజుల తర్వాత ఇరాన్ విసిరిన గూగ్లీ కి పెంటగాన్ వర్గాలు కోలుకోలేని షాక్ కు గురయ్యాని తెలుస్తోంది.

చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్‌బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్‌ (Trump) హయాంలో జరగడం గమనార్హం. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అత్యాధునిక అమెరికా విమానాలను ఇరాన్ ఎలా కూల్చగలిగింది? అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సమాధానం ఇరాన్ 2021లో ప్రవేశపెట్టిన మజిద్ (Majid) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది రాడార్ వ్యవస్థపై ఆధారపడదు. ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌తో కూడిన పాసివ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. సిగ్నల్స్ విడుదల కావు కాబట్టి దాడి జరిగే వరకు విమానంలోని వార్నింగ్ సిస్టమ్స్ దీనిని పసిగట్టలేవు. 8 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల ఎత్తు వరకు టార్గెట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించగలదు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు 15 కి.మీ వరకు పసిగట్టగలవు. ఇదే ఇప్పుడు అమెరికా విమానాలకు శాపంగా మారుతుంది.

Read Also: డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>