ఫారెస్ట్ భూములకు డీ-ఫామ్ పట్టాలివ్వాలి : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

కలం, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్‌లోని ఫారెస్టు భూములకు త్వరితగతిన డి -ఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి (Jayaveer Reddy) కోరారు. శనివారం నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూముల సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తిరుమలగిరి సాగర్ మండలంలో దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. గత 30 సంవత్సరాలుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీ – ఫామ్ పట్టాలు ఇవ్వాలని, అసైన్మెంట్ భూముల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫారెస్ట్ భూములకు డీ-ఫామ్ పట్టాలిచ్చే ప్రక్రియ కొనసాగుతున్నదని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములపై ప్రస్తుతం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి, గ్రామ సభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 12వేల ఎకరాల భూమి సర్వే పూర్తయిందన్నారు. సర్వే నంబర్ల ఆధారంగా రికార్డులు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతుబంధు వంటి పథకాలు దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకున్నామన్నారు. ఫారెస్టు భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు, సిబ్బంది త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి (Jayaveer Reddy) తో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి సాగర్ తహసిల్దార్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: 20 ఏళ్లలో తొలిసారి.. ట్రంప్ కు భారీ షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>