పాత‌బస్తీలో హైడ్రా కూల్చివేతలు.. ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో (Hyderabad Old City)  ఉద్రిక్తత నెలకొన్నది. పత్తర్ గట్టి, హైకోర్టు పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ కొన్ని అక్రమనిర్మాణాలు ఉండటంతో శనివారం హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు వాటిని కూల్చివేశారు. అక్కడికి చేరుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రహమద్ బేగ్ హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. కార్పొరేటర్లతో కలిసి అక్కడికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులతో వాగ్వాదానికి దిగిన రహమద్ బేగ్ ఏకంగా ఏసీపీని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఎంపీ సాబ్‌కు ఫోన్ చేయమంటావా?” అంటూ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: 20 ఏళ్లలో తొలిసారి.. ట్రంప్ కు భారీ షాక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>