కలం, వెబ్ డెస్క్ : కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Modi) డీలిమిటేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తవమని వెల్లడించారు. జనాభా సంఖ్య తగ్గితే ఎంపీ సీట్లు కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు.
అటు కేరళంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలయ్యిందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోవా, కేరళం, తమిళనాడులకు చెందిన అనేక మంది మత్స్యకారులు ఇరాన్, పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుండగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, వామపక్షాలు ఒకరినొకరు బీజేపీ ‘బి టీమ్’ అని పిలుచుకుంటున్నప్పటికీ, వాస్తవానికి కేరళలో బీజేపీయే అసలైన ‘ఎ టీమ్’ అని ప్రధాని మోదీ అన్నారు.
Read Also: పారా ఆర్చరీలో మరో సంచలనం
Follow Us On: X(Twitter)

