కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి బలహీనంగా ఉండడం వల్లే పక్క రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (TRS Chief Kavitha) అన్నారు. బాయిబాటలో భాగంగా బుధవారం గోదావరిఖని 11 ఇంక్లైన్ కార్మికులతో ఆమె మాట్లాడారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారానికి మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
సింగరేణిని (Singareni) కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బొగ్గు బావులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుకు అప్పులు పుట్టడం లేదని.. రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే మహారాష్ట్ర సీఎం ఫోన్ ఎత్తకపోవడం సిగ్గు చేటన్నారు. అందుకే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఏలుకుందామని కవిత (TRS Chief Kavitha) పిలుపునిచ్చారు.
Read Also: హైదరాబాద్‌లో టెస్లా.. ఏఐ స్పెషల్ కార్లు
Follow Us On: X(Twitter)

