అనిల్ రావిపూడి కొత్త మూవీకి డిఫరెంట్ టైటిల్!

కలం, వెబ్ డెస్క్: అనిల్ రావిపూడి (Anil Ravipudi) మూవీ అంటే పక్కా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఫన్నీ టైటిల్స్, డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా అని ఇటీవల కాలంలో సినీ ప్రియులకు బాగా అర్థమైపోయింది. దాన్ని మరోసారి నిజం చేస్తూ.. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టాలని భావిస్తున్నారట. సినిమా ఎలాగూ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది కాబట్టి, ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. సెలెక్టెడ్ టైటిల్ లిస్టులో ఇది కూడా ఒకటని ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్..

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ.ప్రకాశ్ కుమార్‌ను పరిచయం చేస్తూ.. విడుదల చేసిన వీడియో ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేసినట్లు రచయిత అనంత్ శ్రీరామ్ (Anantha Sriram) చెప్పారు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో అనిల్ టీం నిమగ్నమైందని.. జులైలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. 5 నెలల పాటు షూట్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: ‘రణబాలి’తో ఇండియన్ సినీ రంగంలోకి ఆర్నాల్డ్ వోస్లూ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>