Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన త్రిష.. సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం కోలీవుడ్‌లో సీనియర్ నటి త్రిష (Trisha) రెమ్యూనరేషన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దళపతి విజయ్‌తో నటించిన ‘లియో, ది గోట్’ వంటి చిత్రాలతో క్రేజ్‌‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు (అజిత్‌తో ‘గుడ్ బాడ్ అగ్లీ’, మరికొన్ని సినిమాలు) త్రిష మార్కెట్ వాల్యూను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం ఆమె ఒక్కో చిత్రానికి సుమారు రూ. 10 నుంచి రూ.12 కోట్లు వరకు (Remuneration) డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తన నటనతోపాటు బ్రాండ్ విలువ, సోషల్ మీడియా క్రేజ్ తోడైంది. దీంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయికలలో త్రిష ఒకరిగా నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>