తిరంగాలతో కదంతొక్కిన కరీంనగర్.. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీలు

కలం, కరీంనగర్ బ్యూరో : భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar ) నగరంలో బీజేపీ హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. అలాగే నగరంలోని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు.

కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.

బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునోటి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్… బీజేపీ నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ , ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరోవైపు కరీంనగర్ లోని టవర్ సర్కిల్లో బీజేపీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తిరంగా ర్యాలీలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను చేతబూని,భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ అధ్యక్షులు తణుకు సాయి కృష్ణ, కార్పొరేటర్లు వంగల పవన్, మాసం గణేష్,తాటి ప్రభావతి, గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేవసాని సరస్వతి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కో ఆప్షన్ సభ్యులు కన్నె కృష్ణ, బల్బీర్ సింగ్, పార్టీ నాయకులు, స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>