కలం, వనపర్తి: శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వనపర్తి (Wanaparthy) ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Thudi Megha Reddy) పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు నిర్వాహకులు, భక్తులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంపై అమ్మవారి దీవెనలు ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేశ్, కాంగ్రెస్ నాయకులు బి.కృష్ణ, బ్రహ్మచారి, చీర్ల సత్యం సాగర్, చుక్కరాజు, నందిమల్ల చంద్రమౌళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

