ఫ్యూచర్‌ సిటీ రద్దు చేసే శక్తి వారికి లేదు : టీపీసీసీ చీఫ్‌

కలం, వెబ్‌ డెస్క్ : ఫ్యూచర్‌ సిటీ తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని టీపీసీసీ చీఫ్‌ (TPCC Chief) మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్‌రావు ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడంపై తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేది లేదు.. ఆ ప్రాజెక్టును రద్దు చేసేది లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే శక్తి వారికి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నరకం చూస్తున్నారని.. ఈ ఇబ్బందులను అధిగమించేందుకే అన్ని హంగులతో కొత్తగా ఫ్యూచర్‌ సిటీని ప్లాన్‌ చేసినట్లు వివరించారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన ప్రధాని మోదీకి అస్సలు లేదని మహేష్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఇక పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడుతూ.. కేబినెట్ విస్తరణ అనేది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, దాంతో పీసీసీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>