Mobile Popup Ad
Mobile Popup Ad

వైఎస్సార్‌కు జగన్‌, షర్మిల ఘన నివాళులు

కలం, వెబ్ డెస్క్ : దివంగత ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 77వ జయంతి (YSR Birth Anniversary) సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఏపీ సీఎం జగన్‌, కుమార్తె, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు. తొలుత వైఎస్ జగన్‌ పులివెందుల నుంచి రోడ్డుమార్గం ద్వారా ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడి వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతీతో కలిసి జగన్ తన తండ్రికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఆ తర్వాత ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం  వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>