Mobile Popup Ad
Mobile Popup Ad

వారసత్వ సంపదపై అవగాహన ఉండాలి : డైరెక్టర్ నాగలక్ష్మి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిల్లలమర్రి (Pillalamarri) వద్ద జిల్లా పర్యాటక శాఖ, DTO, వారసత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పిల్లల మర్రి లోపల పరిసర ప్రాంతాలను శుభ్ర పరిచే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారసత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, పిల్లల మర్రి మ్యూజియం సిబ్బంది, జిల్లా పర్యాటక శాఖ సిబ్బంది, టూరిజం సిబ్బంది పాల్గొని పరిసరాల పరిశుభ్రత, వారసత్వ కట్టడాల సంరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వారసత్వ ప్రదేశాల పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.

Read Also: ఆ తొమ్మిది రోజులు ఏం జరిగింది?: KTR సంచలన ఆరోపణలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>