Mobile Popup Ad
Mobile Popup Ad

యూసీఎఫ్ నిధుల మంజూరుపై సుడా చైర్మన్ హ‌ర్షం

కలం, కరీంనగర్ బ్యూరో: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీం (UCF)లో భాగంగా కరీంనగర్ పట్టణ అభివృద్ధికి రూ.840 కోట్లు మంజూరైనందుకు సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) కృతజ్ఞతలు తెలియజేశారు. అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్‌తో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపడుతోందని చెప్పారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధికి రూ.840 కోట్లు మంజూరు కావడం, అందులో కేంద్ర ప్రభుత్వం వాటా పోను మిగితా రూ.630 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు హడ్కో నుండి రుణం తీసుకొని అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటూ కరీంనగర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.

గత స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మిగిలిన రూ.140 కోట్ల భాగస్వామ్యంలో రూ.70 కోట్లు రాష్ట ప్రభుత్వ వాటా మంజూరు చేసిందని చెప్పారు. ప్రాజెక్ట్ ముగిసిపోవడంతో కేంద్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు ఇవ్వలేకపోయిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 70 కోట్లతో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ పార్కింగ్, వరదలు వచ్చినప్పుడు నిలిచే ప్రాంతాలలో పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి వినియోగిస్తారని నరేందర్ రెడ్డి అన్నారు. యూసీఎఫ్ నిధుల వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భావించి సీఎం రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి సహక‌రించాల‌ని ప్రధానికి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖలు ఇవ్వడం జరిగిందన్నారు. నేడు అవి కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్యుల అంజన్ కుమార్, కాంతలా జగన్ రెడ్డి, పాడిశేటి భూమయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, గుండటి శ్రీనివాస రెడ్డి, పెద్దిగారి తిరుపతి, బషీర్, సుదర్శన్, హనీఫ్, జిల్కర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>