కలం, సినిమా : టాలీవుడ్‌లో (Tollywood) ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అందరూ చూసేదీ రివ్యూలే. ప్రస్తుతం ఓ సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకులకు బదులు రివ్యూలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ రివ్యూల మూలంగా నిర్మాతలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. సినిమా రివ్యూల పేరిట జరుగుతున్న ఈ డిజిటల్ మాఫియా (Digital Mafia) కు అడ్డుకట్ట వేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది.
కొందరు పెయిడ్ రివ్యూవర్స్ కావాలనే కొన్ని సినిమాలను టార్గెట్ చేసుకొని నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారని దీని వల్ల నిర్మాత తీవ్రంగా నష్టపోతుండటంతో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu) చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఇక నుంచి బుకింగ్ స్లాట్స్‌లో రివ్యూ ఆప్షన్ తొలగించనున్నారు. దీనితో భవిష్యత్‌లో రిలీజ్ కాబోయే భారీ బడ్జెట్ సినిమాలకు ఊరట కలుగనుంది.
Read Also: ‘అనగనగా ఒక రాజు’ టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్
Follow Us On: X(Twitter)


