epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘అనగనగా ఒక రాజు’ టికెట్​ రేట్ల పెంపునకు గ్రీన్​ సిగ్నల్​

కలం, వెబ్​ డెస్క్​ : నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). జనవరి 14 విడుదలవుతున్న ఈ సినిమాకు టికెట్​ ధరల పెంపునకు (Ticket Rates Hike) ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలను రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 (జీఎస్‌టీతో సహా) పెంచుకోవచ్చు. ఈ సవరించిన టికెట్ ధరలు సినిమా విడుదలైన తేదీ నుండి 10 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటాయి.

ఈ పెంపుదల విడుదలైన మొదటి రోజు నుండి ఐదు అదనపు షోలకు కూడా వర్తిస్తుంది. దర్శకుడు మారి, నిర్మాత సాహు గారపాటి (సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్) తెరకెక్కిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా ట్రైలర్​ ఇటీవల విడుదలై మంచి సానుకూల స్పందన అందుకున్నది. అయితే, ఇంత తక్కువ బడ్జెట్​, చిన్న సినిమాకు కూడా టికెట్ రేట్స్​ హైక్​ ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాలకు ఇది మాంచి బూస్ట్​ ఇస్తుంది మూవీ లవర్స్​ భావిస్తున్నారు.

Anaganaga Oka Raju
Anaganaga Oka Raju

Read Also: బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ‌లో రివ్యూ ఆప్షన్ ఉండదా ?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>