కలం, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆసరా కావాల్సిన కృత్రిమ మేధ టూల్స్ తో అశ్లీల, అసభ్యకర కంటెంట్ ఉత్పత్తి చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలన్ మస్క్ గ్రోక్ చాట్ బాట్ పై తాత్కాలికంగా నిషేధం విధించి (Grok Chatbot).. ఏఐ టూల్ యాక్సెస్ ను నిరాకరించిన మొదటి దేశంగా ఇండోనేషియా (Indonesia) నిలిచింది.
యూరప్, ఆసియా దేశాల ప్రభుత్వాలు, పరిశోధకులు, నియంత్రణ సంస్థలు యాప్ లోని లైంగిక కంటెంట్ పై విచారణ ప్రారంభించిన తరువాత ఈ చర్చ తీసుకుంది. ఈ మేరకు గ్రోక్ (Grok Chatbot) పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ఇండోనేషియా కమ్యూనికేషన్ మంత్రి ముత్యా హఫీద్ ప్రకటించారు. మహిళలు, చిన్నారుల సహా సమాజాన్ని అశ్లీల కంటెంట్ నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
డీప్ ఫేక్ వల్ల పౌరుల భద్రత ఉల్లంఘనగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి ఇండోనేషియా ప్రభుత్వం ఎక్స్ అధికారులను పిలిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా, అశ్లీలంగా భావించే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం చేయడాన్ని నిషేధించే కఠినమైన నియమాలను కలిగి ఉంది. అలాగే, గ్రోక్ లోని అసభ్యకర కంటెంట్ విషయంలో భారత్ కూడా ఇటీవల తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
Read Also: పెరిగిన వీసా ప్రాసెసింగ్ ఫీజు.. అమెరికా కొత్త నిబంధనలివే..
Follow Us On: Instagram


