కలం, స్పోర్ట్: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు ఇండియాలో తీవ్ర చర్చలకు దారితీసిన విషయం.. గిల్‌పై (Shubman Gill) వేటు. ఎవరూ ఊహించని విధంగా సెలక్టర్లు గిల్‌పై వేటు వేశారు. ఈ అంశంపై ఇంతకాలం మౌనంగా ఉన్న గిల్.. తాజాగా పెదవి విప్పాడు. ఇదంతా కూడా తన డెస్టినీ అని, తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుందని తాను బలంగా నమ్ముతానంటూ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం గిల్ మీడియాతో మాట్లాడారు.
26 ఏళ్ల బ్యాట్స్‌మెన్ గిల్ (Shubman Gill) చివరి 15 T20ఇల్లో 291 పరుగులు మాత్రమే సాధించి సగటు 24.25తో నిలిచారు. దీనివల్ల సెలెక్టర్లు ఎక్కువ దాడి శైలిలోని టాప్ ఆర్డర్‌కు అభిషేక్ శర్మ సంజు సామ్సన్ ఈశాన్ కిషన్ను ఎంపిక చేశారు.
గిల్ ఈ నిర్ణయాన్ని “డెస్టినీ”గా భావిస్తున్నట్లు తెలిపారు. “నా జీవితంలో నేను ఉండాల్సిన చోటే ఉన్నానని నమ్ముతాను. డెస్టినీలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. T20 జట్టు మన కోసం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అని గిల్ చెప్పుకొచ్చాడు.
T20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారతదేశం శ్రీలంకలో జరుగనుంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా గెలుపు రాబట్టాలని చూస్తోంది. ODI సిరీస్‌పై దృష్టి సారించిన గిల్ జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి అగ్రస్థాయి ఆటగాళ్ల మద్దతును గుర్తించాడు. “ఈ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నప్పుడు కష్టసమయంలో వారి అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు. అది ప్రతి కెప్టెన్‌కు అమూల్యమైనది,” అన్నారు.
Read Also: “జన నాయగన్” వాయిదా.. రీరిలీజ్‌తో పొంగల్ బరిలోకి
Follow Us On: Youtube


