Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో అమానుష ఘటన.

కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati)లోని రమాదేవి ఆసుపత్రి (Ramadevi Hospital)లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బిల్లు పూర్తిగా చెల్లించలేదనే కారణంతో మృతదేహాన్ని ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతోంది.

పలమనేరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో తిరుపతిలోని (Tirupati) రమాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చికిత్స పేరుతో ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి ఆసుపత్రి యాజమాన్యం సుమారు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ఇంకా రూ.45 వేల బకాయి ఉందని చెబుతూ మృతదేహాన్ని ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారని వారు ఆరోపించారు. డబ్బు సమకూర్చుకోవడానికి శ్రీనివాస్ భార్య, తల్లి తమ పుస్తెలు తాకట్టు పెట్టి ఇప్పటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడి అవమానపరిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని బాధితులు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకుని మృతదేహాన్ని అప్పగించాలని వారు అధికారులను కోరుతున్నారు.

Read Also: కర్ణాటక టు శ్రీశైలం.. చెక్క కట్టెలపై యువకుడి సాహస యాత్ర, చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>