ఫుల్‌టైమ్ డీజీపీపై డిస్కషన్… నేడు ఢిల్లీకి సీఎస్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి ఫుల్ టైమ్ డీజీపీ (Telangana Full Time DGP) ఎవరు? యూపీఎస్సీ ఎవరిని ఖరారు చేస్తుంది? రాష్ట్రం పంపిన జాబితాలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? వారికి ఉన్న అర్హతలు, రిమార్కులు ఏంటి? వీటన్నింటిపై యూపీఎస్సీ ఇప్పటికే స్టడీ చేసింది. యూపీఎస్సీ చైర్‌పర్సన్ ఆదేశం మేరకు ఒక సభ్యుడి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ సభ్యుడు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీ సమావేశం ఢిల్లీలోని యూపీఎస్సీ హెడ్‌క్వార్టర్‌లో బుధవారం ఉదయం జరగనున్నది. మొత్తం ముగ్గురు సభ్యులుండే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) కూడా ఒక సభ్యుడు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలుగురి పేర్లలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ ఈ సమావేశంలో చర్చల అనంతరం షార్ట్ లిస్టు చేయనున్నది. ఈ ముగ్గురిలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయారిటీకి అనుగుణంగా ఒకరిని ఫుల్‌టైమ్ డీజీపీగా ఎంపిక చేయనున్నది. ఆ అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నేడు ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ :

యూపీఎస్సీ షెడ్యూలు చేసిన ఫుల్ టైమ్ డీజీపీ (Telangana Full Time DGP) ఎంప్యానెల్‌మెంట్ మీటింగ్ బుధవారం ఉదయం ఢిల్లీలో జరగనున్నది. దీని కోసం మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్ళాలని సీఎస్ భావించారు. రాష్ట్రంలో ఉన్న ప్రీ-షెడ్యూలు మీటింగ్‌లను పరిగణనలోకి తీసుకుని రాత్రి పది గంటల తర్వాత వెళ్ళేలా ప్లాన్ మార్చుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఢిల్లీకి చేరుకునే చీఫ్ సెక్రటరీ.. బుధవారం మధ్యాహ్నం యూపీఎస్సీ కమిటీ సమావేశం పూర్తికాగానే తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాద్‌కు రిటన్ కానున్నారు. కేవలం ఫుల్ టైమ్ డీజీపీ ఎంపికపై ఎంప్యానెల్‌మెంట్ మీటింగులో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో సీనియారిటీ ప్రకారం సీవీ ఆనంద్, శిఖా గోయల్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురిని యూపీఎస్సీ ఫైనల్ చేస్తుంది. ఆ తర్వాత అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సెలెక్టు చేస్తుంది.

Read Also: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>