కలం, వెబ్ డెస్క్: వెలుగుమట్ల (Velugumatla) బాధితుల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పోరాడుతున్న విషయం తెలిసిందే. బాధితుల తరఫున ఆమె నిరాహార దీక్ష చేశారు. వెంటనే ఇండ్లు కోల్పోయిన వారికి అదే స్థలంలో ఇల్లు కట్టించితీరాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) లేఖ రాశారు. వెలుగు మట్ల బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్లలో మొత్తం 600 ఇళ్లను కూల్చివేశారని, దాదాపు 2 వేల మంది నిరాశ్రయులయ్యారని కవిత పేర్కొన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేసిందని కవిత ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని, కూల్చి ఇళ్లను ప్రభుత్వం పునర్ నిర్మించే వరకు తన పోరాటం ఆగదన్న స్పష్టం చేశారు. వెలుగుమట్ల కూల్చివేత ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
వెలుగుమట్లలో ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు కవిత (Kavitha) పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులు చూస్తే అది కేవలం పరిపాలనా చర్య కాదని, వందలాది పేద కుటుంబాల జీవితాల నాశనం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 600 ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి దాదాపు 2 వేల మందిని ఒక్క రాత్రిలోనే నిరాశ్రయులను చేశారని తెలిపారు. ప్రభావిత కుటుంబాల్లో చాలా మంది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు చెందినవారని, వారు ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములపై నివసిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు నివాసితులు అప్పటి భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలను చూపించినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇళ్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఇళ్ల కూల్చివేతకు ముందు సరైన నోటీసులు కూడా ఇవ్వలేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయని కవిత పేర్కొన్నారు.
Read Also: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Follow Us On: Facebook

