భద్రాచలంలో భారీ గంజాయి గుట్టురట్టు

కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి రవాణా గుట్టును భద్రాచలం (Bhadrachalam) పట్టణ పోలీసులు శనివారం మధ్యాహ్నం రట్టు చేశారు. వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలో, కూనవరం రోడ్డుపై నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు రూ.25 లక్షల విలువ గల 101 కిలోల డ్రై గంజాయితో పాటు మారుతి ఎర్టిగా కారును, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

​భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం ప్రాంతం నుండి కర్ణాటకలోని బెంగళూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న మారుతి ఎర్టిగా కారును పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కారులో రహస్యంగా దాచిన 101 కిలోల డ్రై గంజాయి బయటపడటంతో అధికారులు దాన్ని వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

​ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న బెంగళూరు దక్షిణ, బొమ్మనహళ్లికి చెందిన సలీం పాషా (53), ఎం.డి. అర్బాజ్ హుస్సేన్ (22), బెంగళూరులోని జయనగర, నెలమంగలకు చెందిన ఎస్. గుల్జార్ (35)లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నల్లమడకు చెందిన ఈ. రాజేంద్ర ప్రసాద్ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, అలాగే సరిహద్దు మార్గాల్లో నిఘా మరింత తీవ్రతరం చేస్తామని పోలీసులు వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>