కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోవడంతో.. భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి నెలకొంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజులో తిరుమల శ్రీవారిని 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 39,083 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.
Read Also: భగీరథ్ విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది: సీపీఐ నారాయణ
Follow Us On: Instagram

