Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ మూవీ రన్‌టైమ్‌పై కీలక అప్‌డేట్

కలం, సినిమా : మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దీనితో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. రిలీజ్ డేట్ వరకు వరుస ఈవెంట్స్‌తో మేకర్స్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ అందించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పెద్ది సినిమా రన్ టైమ్‌పై కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమా (Peddi) సెన్సార్ కోసం మేకర్స్ సుమారు 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌తో వెళ్లినట్లు సమాచారం. అయితే సెన్సార్ ప్రక్రియ అనంతరం విడుదలకు సిద్ధమవుతున్న ఫైనల్ రన్‌టైమ్‌ను చిత్రబృందం సుమారు 3 గంటలకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా కథనాన్ని మరింత ఫాస్ట్ పేస్‌లో, ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మార్చేందుకు కొన్ని సీన్స్ కట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఎడిటింగ్ చేసినట్లు సమాచారం. పెద్ది సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనగా, రన్‌టైమ్ మార్పుతో సినిమా మరింత టైట్ నరేషన్‌లో ఉండబోతోందని సమాచారం.

Read Also: నంది చెవిలో కోరికలు ఎలా చెప్పాలి? పురాణాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>