తిరుమలలో కల్తీ నెయ్యి వాడేందుకు ఆస్కారం లేదు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో కల్తీ నెయ్యి (Adulterated Ghee) వాడేందుకు ఇక ఆస్కారం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు.హైదరాబాద్ ISBలో నిర్వహించిన సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్-2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేశామని.. దీంతో తిరుమలలో కల్తీ నెయ్యి వాడలేరని చెప్పారు.ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మించామని గుర్తు చేశారు. అప్పుడు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తెలుగు రాష్​ట్రాలు ఫార్మాలో నెంబర్ వన్ గా ఉన్నాయని వెల్లడించారు.

అయితే 2024లో తాము అధికారంలోకి వచ్చేసరికి.. ఏపీ అంతా సర్వనాశనం అయిందని చెప్పారు. వైసీపీ (YCP) ప్రజలు తీసుకున్న నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని వివరించారు. ఏపీలో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీల నిర్మాణం జరిగిందన్న చంద్రబాబు (Chandrababu).. గ్రీన్ ఇంధన తయారీ లో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో త్వరలో డిజిటల్ హెల్త్ రికార్డులు ఇస్తామని చెప్పుకొచ్చారు.

Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>