’పెద్ది’లో స్పెషల్ సాంగ్.. ఆ గ్లామర్ బ్యూటీకి ఛాన్స్

కలం, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi). బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తామని మొదట్లో ప్రకటించారు. కానీ తర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే మెజార్టీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో రెండు, మూడు సీన్లు, ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే ఉంది. తాజాగా ఆ స్పెషల్ సాంగ్ కోసం ఓ గ్లామర్ బ్యూటీని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల భామ మృణాల్ ఠాకూర్ ను ఇప్పటికే బుచ్చిబాబు టీమ్ కలిసింది. రీసెంట్ గానే దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. మృణాల్ ఇప్పటి వరకు ఇలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు. కానీ ఈ సాంగ్ భారీ సెట్స్ లో చేస్తున్నారంట. స్టార్ హీరోయిన్ అయితేనే క్రేజ్ ఉంటుందనే ఉద్దేశంతో మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే షూటింగ్ ఉండబోతోందంట. మృణాల్ స్పెషల్ సాంగ్ లో మెరిస్తే రచ్చ మామూలుగా ఉండదని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>