కలం, ఖమ్మం బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కల్యాణోత్సవ వేదిక మారనుంది. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా సాంకేతిక కారణాల దృష్ట్యా నిత్య కల్యాణాలను కొత్తగా నిర్మించిన మండపంలో నిర్వహించాలని దేవస్థాన అధికారులు నిర్ణయించారు.
ఆగస్టు 8వ తేదీ శనివారం నుంచి శ్రీ సీతారాముల నిత్య కల్యాణ మహోత్సవాలను మిథిలా స్టేడియంలో నూతనంగా నిర్మించిన నిత్య కల్యాణ మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరుగుతున్న వేదికకు బదులుగా కొత్త మండపంలోనే కల్యాణోత్సవాలు నిర్వహించనున్నందున భక్తులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. నిత్య కల్యాణాలకు వచ్చే భక్తులు ఆలయ యంత్రాంగానికి సహకరించాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు.

