నందిపేట్‌లో ఎమ్మార్పీఎస్ నియోజవకర్గ సమావేశం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ (MRPS) నియోజకవర్గ సమావేశం జరిగింది. పార్టీ నందిపేట్ మండల ఇన్‌ఛార్జి పైడాకుల ప్రశాంత్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య సాధన దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మైలారం బాలు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రంలోని అన్ని కులాల పేదలకు ఉచితంగా అందుతోందన్నారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే ఎమ్మార్పీఎస్ పోరాటం కారణంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిశాసన సభలో చెప్పారని గుర్తు చేశారు.

వివక్ష లేని సమాజం కోసం..

మహనీయుల ఆలోచన విధానమే ఎమ్మార్పీఎస్ పోరాట మార్గమని, ప్రస్తుత పరిస్థితుల్లో కులం, మత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం యువత నడుం బిగించాలని బాలు మాదిగ కోరారు. మూడు దశాబ్దాల దండోరా ఉద్యమంలో సమాజ హితం కోసం ఎమ్మార్పీఎస్ పాటుపడిందన్నారు. నందిపేట మండల గ్రామ నూతన కమిటీల నియామకం చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగా మండలాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.పోశెట్టి, శ్రీకాంత్ మాదిగ, రాజు మాదిగ, నితిన్, ప్రవీణ్, నల్లన్న, సతీష్, అనిల్, గంగాధర్, జీవన్, సాయన్న, మహేష్, సాయన్న, రాజు, ఎం.భోజన్న, సాయిలు, కె.గంగారాం పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>