Mobile Popup Ad
Mobile Popup Ad

మూడు పార్టీల మద్దతు.. తమిళనాడు సీఎంగా విజయ్!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్‌కు (Vijay) లైన్ క్లియర్ అయింది. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు అధికారికంగా వెల్లడించాయి. ఇవి తలా రెండేసి చొప్పున 6 సీట్లు గెలుపొందాయి. టీవీకేకు (TVK) 108 సీట్లు రాగా.. ఆ పార్టీ అధినేత విజయ్ రెండు చోట్ల గెలుపొందారు. దీంతో, ఒకటే స్థానం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన టీవీకేకు 107 సీట్లు, ఇప్పటికే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌కు 5 సీట్లతో కలిపి మొత్తం 112 స్థానాలున్నాయి. తాజాగా లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో మిగిలిన ఆరు సీట్లు లభించడంతో.. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 118కి చేరినట్లయింది. ఈ జాబితాను గవర్నర్‌ను కలిసి విజయ్ సమర్పించబోతున్నారు.

రాత్రి వరకల్లా ప్రకటన వెలువడే అవకాశం..

ఈ రోజు రాత్రి వరకల్లా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్‌ను (Vijay) గవర్నర్ ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో, గత మూడు రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం.. టీవీకే అగ్ర నేతలు లెఫ్ట్ పార్టీలు, వీసీకేతో ఎడతెగని చర్చలు జరిపారు. ఎట్టకేలకు వారు సైతం సుముఖంగా ఉండటంతో లైన్ క్లియర్ అయింది.

Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>