బిగ్గెస్ట్ డిజాస్టర్‌.. రూ. 1400 కోట్ల ఖర్చు పెడితే, కలెక్షన్స్ 6 కోట్లు మాత్రమే!

కలం, వెబ్ డెస్క్: భారీ బడ్జెట్ అంచనాలను తలకిందులు చేస్తూ సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘డెజర్ట్ వారియర్’ (Desert Warrior) మూవీ బాక్సాఫీస్ రేసులో బోల్తా కొట్టంది. ఈ మూవీ ప్రపంచ సినిమా చరిత్రలోనే అతిపెద్ద పరాజయాలలో (Disaster) ఒకటిగా నిలిచింది. సుమారు రూ. 1400 కోట్ల భారీ వ్యయంతో హాలీవుడ్ నటీనటులతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏడో శతాబ్దపు అరేబియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందు కోసం భారీ సెట్లు, వందలాది మంది సిబ్బందితో సినిమాను నిర్మించారు. కానీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది.

ఈ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణాలు బలహీనమైన ప్రచార వ్యూహాలు, ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర అమెరికాలో 1,000కి పైగా థియేటర్లలో విడుదలైనప్పటికీ, అక్కడ కేవలం కొన్ని లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. చివరకు సొంత మార్కెట్ అయిన సౌదీ అరేబియాలో కూడా ఈ చిత్రానికి దక్కని ఆదరణ మేకర్స్‌ను విస్మయానికి గురిచేసింది. పెట్టిన పెట్టుబడిలో 4 శాతం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. కేవలం భారీ బడ్జెట్, అంతర్జాతీయ తారాగణం ఉన్నంత మాత్రాన విజయం దక్కదని, సరైన ప్రణాళిక లేకపోతే ఘోరంగా ఫెయిల్ అవుతుందని సినిమా విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>