Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు

కలం, వెబ్ డెస్క్ : కన్న కూతురును ఇచ్చి పెళ్లి చేసిన అత్తను అమ్మలా చూసుకోవాల్సింది పోయి ఓ మానవ మృగం దారుణానికి ఒడిగట్టాడు. భార్యభర్తల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన అత్తపై ఓ అల్లుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ గరీబ్ గత కొన్ని రోజులుగా మద్యం తాగి వచ్చి భార్య ఫాతిమాతో గొడవ పడుతున్నాడు.

ఈ క్రమంలో తన అల్లుడు మహ్మద్ గరీబ్ కు నచ్చజెప్పేందుకు అక్సాన్ పల్లి నుంచి కూతురి ఇంటికి మహిళ వచ్చింది. మరోసారి గొడవ జరగగా భార్య ఫాతిమాను పక్కకు నెట్టేసిన మహ్మద్ గరీబ్ అత్తను రూమ్ లోకి లాక్కెళ్లి గడియ పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఫిక్స్..!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>