ఏదుల రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ

కలం, వనపర్తి: ఏదుల రిజర్వాయర్ (Edula Reservoir) నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎట్టకేలకు నష్టపరిహారం అందింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.21 కోట్ల పరిహారాన్ని శుక్రవారం పంపిణీ చేశారు. వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏదుల గ్రామానికి చెందిన 22 మంది రైతులకు 9.28 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురుచూస్తున్న తమకు నేడు నష్టపరిహారం అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించడానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏదుల మండల అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి, జిల్లా నాయకులు వాడల పర్వతాలు, జయపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి గోపాల్‌పేట అధ్యక్షుడు జానకిరాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కృష్ణయ్య, గొల్లపల్లి సర్పంచ్ సంతోష, భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>