పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి (Suvendu Adhikari) పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో సువేందు అధికారిని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు సామిక్ భట్టాచార్య ప్రకటించగా.. అందరూ ఆమోదం తెలిపారు. ఈ మీటింగులో ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం పాల్గొన్నారు. మొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండగా.. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. పోటీలో పలువురు కీలక నేతలున్నా.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సువేందు అధికారిని అగ్ర నాయకత్వం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

 ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు..

సీఎం కుర్చీ కోసం పోటీ పడిన దిలీప్ ఘోష్, అగ్రిమిత్ర పాల్, సామిక్ భట్టాచార్యలో ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వబోతున్నారు. అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసినవారికి సైతం ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వబోతున్నారు. ప్రమాణ స్వీకారంపై మరికాసేపట్లో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read Also: కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఫిక్స్..!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>